అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఇటివల విడుదలైన మూవీ మహానటి.విడుదలైన నాటి నుండి నేటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్లను సొంతం చేసుకుంటుంది.ఈ మూవీలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ఇటు నటనకు ,అభినయానికి ,అందానికి మంచి మార్కులు కొట్టేసింది ముద్దుగుమ్మ .
నిన్న మొన్నటి వరకు అవకాశాలు రావడమే గగనమైన తరుణంలో మహానటి ఇచ్చిన ఘనవిజయంతో అవకాశాల మీద అవకాశాలు కీర్తి గుమ్మం ముందు క్యూ కడుతున్నాయి.తాజాగా ఆమె ప్రముఖ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో పలు విషయాల గురించి స్పష్టత ఇచ్చింది అందాల భామ .
ఆమె మాట్లాడుతూ తను భవిష్యత్తులో నిర్మాతగా అసలు మారను .దర్శకత్వం చేసే అర్హతలు కానీ టాలెంట్ కానీ నాదగ్గర లేవు.అభిమానులు నన్ను ఆదరించేవరకు సినిమాలలో నటిస్తాను.ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతా .అయితే నాది మాత్రం ప్రేమ పెళ్లి .నేను ఖచ్చితంగా ఇంట్లో ఒప్పించే చేసుకుంటాను అని అమ్మడు బాంబ్ పేల్చడంతో అప్పుడే కీర్తి ఇండస్ట్రీలో యువహీరోతో ప్రేమలో మునిగితేలుతుందని రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి ..