తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి పూనమ్ కౌర్ మరోసారి టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూవీలకు దర్శకత్వం వహించి హిట్ సినిమాలను అందించిన ప్రముఖ దర్శకుడిపై ఫైర్ అయ్యారు .ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్నాయి .ట్విట్టర్ సాక్షిగా పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ
దర్శకుడు నాలుగు కుటుంబాల అండతో ఎన్నారై హీరోయిన్ కు మద్దతుగా ఉన్నారు .
తనకు హిట్లు లేవని ఆమెకు అండగా ఉన్నారు.అయితే ఆమెకు ఏ మాత్రం హిట్లు ఉన్నాయి అని ఆమె ప్రశ్నించారు . కొన్ని కొన్ని ఉద్యోగాలు చేయకపోవడమే మంచిదని ..”జల్సా”లు చూపిస్తూ “అజ్ఞాతవాసం”లో పడేస్తాడు ..జాగ్రత్త ..నమ్మకద్రోహి అని ఆమె ట్వీట్ చేశారు .అంతే కాకుండా మంచికి విలువ ఇస్తే చెడు వచ్చేది కాదు అంటూ సదరు దర్శకుడ్ని ఉద్దేశిస్తూ ఆమె పేర్కొన్నారు .
పూనమ్ ట్వీట్లకు ఒక నెటిజన్ స్పందిస్తూ మీరు కుంగుబాటులో ఉన్నారు.ఏదైనా సమస్య ఉంటె మంచి డాక్టర్ను కలవండి అని ఆమెకు కౌంటర్ ఇచ్చాడు.దీనికి సమాధానంగా ఇది నిజం .నేను కుంగు బాటులో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు కావు .మీగురువులు జీవితాలని నాశనం చేయడంలో చాలా గొప్పవారు.వారి దగ్గరకు వెళ్ళు నన్ను ట్విట్టర్ లో ఫాలో అవ్వడం ఆపండి అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.అయితే పూనమ్ పవన్ కళ్యాణ్ కు హిట్ సినిమాలను అందించిన మాటల రచయిత నుండి దర్శకుడిగా మారిన వ్యక్తీ గురించే అని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..