ప్రతిష్టాత్మక ఫుట్బాల్ ప్రపంచకప్లో పాల్గొంటున్నపుడు ఆటగాళ్లకు ఎంతటి ఏకాగ్రత ఉండాలో ప్రత్యేకంగా చెప్పేదేముంది? వేరే వ్యాపకాలన్నీ పక్కన పెట్టి కేవలం ఆట మీదే దృష్టి సారించాల్సి ఉంటుంది. అలాంటపుడు అమ్మాయిలు, శృంగారం గురించి ఆలోచించే అవకాశమెక్కడుంటుందనే అనుకుంటారంతా. బ్రెజిల్ దిగ్గజ ఆటగాడు రొమారియో మాత్రం ప్రపంచకప్ సమయంలో శృంగారానికి దూరం కావద్దంటున్నాడు. ఈసారి బ్రెజిల్ జట్టుకు ప్రత్యేక ఆకర్షణ అవుతాడని భావిస్తున్న 21 ఏళ్ల గాబ్రియల్ జీసస్కు ఈ విషయంలో రొమారియో ఓ సలహా కూడా ఇచ్చాడు.
see also..
భరత్ అనే నేను స్పెషల్ ట్రైలర్ చూశారా..?
మ్యాచ్ల మధ్య విరామం దొరికినపుడల్లా శృంగారంలో పాల్గొనమని.. తాను 1994 ప్రపంచకప్లో ఐదు గోల్స్ కొట్టి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకోవడానికి ఇదే కారణమని చెప్పాడు. అమెరికాలో జరిగిన ఆ టోర్నీలో ఖాళీ దొరికినపుడల్లా తాను శృంగారంలో పాల్గొనేవాడినని రొమారియో చెప్పాడు. ఇప్పుడు జీసస్ కూడా తనను అనుసరించాలన్నాడు. ‘‘చాలినంత శృంగారం అవసరమన్నది నా సలహా. మ్యాచ్ల సమయంలో మాత్రం ఆట మీదే దృష్టి ఉండాలి’’ అని రొమారియో అన్నాడు. మరి అతడి సలహాను జీసస్ ఏమాత్రం పాటిస్తాడో చూడాలి.
see also..