తెలుగు ప్రజల మనసు దోచుకున్న సూర్యవంశం, సుస్వాగతం లాంటి మంచి హిట్ సినిమాలో డైరెక్షన్ తో అదరగొట్టిన డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్. తాజాగా హాస్య నటుడు సునీల్, అల్లరి నరేష్ హీరోలుగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఇవాళ సిల్లీఫెలోస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
see also:పవన్ గురించి చెప్పిన శ్రీరెడ్డికి కన్నీరు ఆగలేదు..!
This time,I’m back with a hilarious entertainer – old school style. #SillyFellows coming soon in a theatre near you! pic.twitter.com/DqDtmXejOQ
— Allari Naresh (@allarinaresh) June 8, 2018
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులముందుకు రానున్నట్లు హీరో నరేష్ తెలిపాడు . ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపింది యూనిట్. సునీల్, నరేష్ కామెడీ పండించడంలో అదుర్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని ఫస్ట్ లుక్, టైటిల్ చూస్తుంటే ప్రేక్షకులకు ఫుల్ కామెడీ ఉంటుందని తెలుస్తుంది.