ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. పాదయాత్ర ప్రభావంతో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం వైపు దూసుకెళ్తుంది . తాజాగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీ వైపు చూస్తున్నారు. అనుకున్నట్టుగా జరిగితే ఆయన ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబరులో అదికారంలో ఉన్న తెలుగుదేశంను వీడిన తర్వాత ఆయన ఎటువంటి రాజకీయ అడుగులు వేయలేదు. కానీ అంతర్గతంగా చాలా అధ్యయనాలు చేసుకున్నారు. అభిప్రాయాలు తీసుకున్నారు.
తాజాగా శుక్రవారం వైసీపీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి తన మనసులో మాట బయటపెట్టినట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య పలు రాజకీయ అంశాలు, గిద్దలూరులో తాజా పరిణామాలు చర్చకు వచ్చాయి. తన బలగం ఏమిటనేది రాంబాబు వివరించారు. పార్టీలో చేరిక విషయాన్ని ఇద్దరూ ఖరారు చేయనప్పటికీ ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశమే. కొద్దిరోజుల్లోనే రాంబాబు ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. దీంతో పాటు విడతల వారీగా ఆయన మరోసారి అనుచరులు, అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వారి అభిప్రాయాలు తెలుసుకుని తదుపరి నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై రాంబాబును వివరణ కోరగా, గిద్దలూరు రాజకీయాలపై చర్చించేందుకే బాలినేనిని కలిశానన్నారు. వైసీపీలో చేరికపై తనకు స్పష్టత లేదని, అనుచరుల అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటానన్నారు. వచ్చే నెలలో తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. మరి కొద్దిరోజుల్లోనే వైఎస్ జగన్‌తో మాట్లాడి ఏ విషయాన్ని ఖరారు చేస్తానని చెప్పినట్లు సమాచారం. తాను ఏమనుకుంటున్నారో? ఏమి ఆశిస్తున్నారు? వేచి చూడలి మరి