యవ నేత,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్,టాలీవుడ్ యంగ్ హీరోలు రానా, నాగచైతన్య, విజయ్ దేవరకొండ ఓకె వేదికపై కనపడనున్నారు.తెలంగాణ యాస,బాషా తో `పెళ్లి చూపులు` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఓరుగల్లు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తాజగా తెరకెక్కించిన సినిమా `ఈ నగరానికి ఏమైంది`. ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాత వహించారు .
see also:విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్..!!
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్నుఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని లోటస్ పాండ్ సమీపంలోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియమ్‌లో సాయంత్రం 6 గంటలకు ఘనంగా జరుగనుంది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తోపాటు టాలీవుడ్ యంగ్ హీరోలు రానా, నాగచైతన్య, విజయ్ దేవరకొండ తదితరులు హాజరుకాబోతున్నారని ముఖ్య సమాచారం .అయితే యువ మంత్రి తో యువ హీరోలు ఓకె వేదికపై కనపడబోతుండడంతో అభిమానుల్లో కొత్త ఆసక్తి నెలకొంది..ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైనఈ సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకోగా సినిమాపై అంచనాలను పెంచేసింది.