ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగలే రాణి అనే పాట పాడిన వెంకటలక్ష్మికి అండగా నిలిచారు.వివరాల్లోకి వెళ్తే అక్కినేని కోడలు సమంత,మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ఇటీ వల జంటగా నటించిన చిత్రం రంగస్థలం .ఈ సినిమా భారీ విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో‘ జిల్ జిల్ జిగలే రాణి’ అనే పాట పాడిన గంటా వెంకట లక్ష్మీ తనకి అన్యాయం జరిగిందంటూ గత కొన్ని రోజుల క్రితం మీడియా ముందు తన ఆవేదనను తెలిపింది . ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో చిన్న చిల్లర కిరాణషాఫు నడుపుకుంటూ జీవనం కొనసాగించే గంటా వెంకటలక్ష్మికి సినిమాలో పాడే అవకాశం నాగభూషణం అనే మధ్యవర్తి ద్వారా వచ్చిందని , పాట పాడినందుకు ఇచ్చే పారితోషికం మొత్తం తానే తీసుకున్నాడు. తనకు ఇవ్వలేదని తెలిపింది.
అయితే ఆ వీడియో కొంచెం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంకటలక్ష్మికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న సుకూమార్ ఆమెకు వెంటనే రూ. లక్ష రూపాయల చెక్‌ను పంపించి, అండగా నిలిచాడు.