అర్జున్‌రెడ్డి, చిన్న సినిమాగా మొదలై ఇండస్ట్రీ గతిని మార్చేసిన పెద్ద సంచలనం. ఈ చిత్రం తరువాత మేకింగ్ మారిపోయింది. కొత్త కథలు రావడం మొదలైంది. అన్నిటికంటే ముందు బోల్డ్ కథలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఇలా ఉంటే. .ఈ చిత్రంతో విజయ దేవరకొండ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దాంతోపాటే అడల్డ్ ఇమేజ్ కూడా పెగింది. దీంతో ఆ అడల్ట్ ఇమేజ్‌ను చెరిపేసుకునే పనిలో పడ్డాడు ఈ కుర్ర హీరో.
గీత గోవిందం చిత్రంతో ఆ వైపుగా అడుగులు వేస్తున్నాడు విజయ దేవరకొండ. ఈ చిత్రంలో తన పాత్రకు మంచి పేరు వస్తుందంటున్నాడు. అయితే, ఇటీవల విడుదలైన గీత గోవిందం చిత్రం పోస్టర్స్ ను చూసిన ప్రేక్షకులు.. ఈ చిత్రం కూడా అర్జున్‌రెడ్డిలా ఉండబోతుందన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ రావడంతో సినీ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అయితే, ఆగస్టు 15న గీత గోవిందం చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తన ఇమేజ్‌ను కచ్చితంగా మారుస్తున్న గట్టి నమ్మకంతో ఉన్నాడు విజయ్ దేవరకొండ.
లవ్ బాయ్ పాత్రలు చేస్తే ఈ ఇమేజ్ నుంచి బయట పడలేమని సందేశాత్మక కథలవైపు అడుగులు వేస్తున్నాడు. ఇక ఆనంద్‌శంకర్ తెరకెక్కిస్తున్న నోటా చిత్రంలో రాజకీయ నాయకులపై పోరాడే పాత్రలో నటిస్తున్నాడు. మరో వైపు డియర్ కామ్రేడ్ చిత్రంలో సోషల్ యాక్టివిస్ట్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రాలతోనైనా అర్జున్ రెడ్డి ఇమేజ్ క్లీన్ అవుతుందో..? లేదో..? అన్న విషయాన్ని కాలమే నిర్ణయించాలి.