టాలివుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ సాధించిన విజయ్ దేవరకొండ.మరో పెద్ద హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు.ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా ,రష్మిక హిరోయిన్ గా జంటగా నటించిన చిత్రం గీత గోవిందం.ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు,ట్రైలర్,పోస్టర్స్ తో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.అయితే ఈ సినిమా విడుదలకు ముందే సినిమా లీక్ అవడంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్ గురయ్యింది.
ఏపీ లోని నంబూరు సమీపంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి వద్ద ‘గీత గోవిందం’ సినిమా సీడీలు, పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయని సమాచారం తెలుసుకున్నపోలీసులు..శనివారం రాత్రి దాడులు చేశారు. అతని నుంచి పెన్‌డ్రైవ్, సీడీలు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్బంగా ఆ అబ్బైని విచారించగా తనకు తాడేపల్లిలోని తన ఫ్రెండ్ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే సినిమా లీకేజీకి కారణం ఓ ఎడిటర్ అని పోలీసు విచారణలో పేర్కొన్నారు. ఈ క్రమంలో విజయ్ ‘నేను చాలా నిరాశకు లోనవుతున్నా..ఐ హర్ట్ .. ఒక్కసారి కోపం వస్తుంది.. ఒంకోసారి ఏడుపొస్తుంది’ అని ఓ ట్వీట్ చేశాడు.
I feel let down, disappointed, hurt.
Okka sari kopam osthundi, inko sari edupostundi.— Vijay Deverakonda (@TheDeverakonda) August 12, 2018