గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం వణికిపోతున్న సంగతి తెలిసిందే. అయితే వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం,పలు రాష్ట్ర ప్రభుత్వాలు ,సినిమా హీరోలు ,పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే అతి పెద్ద ఫ్యామిలీ అయిన మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి 50 లక్షల నగదు సాయం చేయగా, 10 లక్షల రూపాయల మందులు అందించేందుకు చిరు కోడలు ఉపాసన ముందుకు వచ్చారు.అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25 లక్షలు , కళ్యాణ్ రామ్ 10 లక్షలు తమవంతు సాయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగార్జున, అమల తాము 28 లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు.
