Home / ANDHRAPRADESH / జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకీ అవసరం లేదు…ఆగ్రహంలో ఫ్యాన్స్…!

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకీ అవసరం లేదు…ఆగ్రహంలో ఫ్యాన్స్…!

జూనియర్ ఎన్టీఆర్‌పై బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్విని భర్త శ్రీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదన్న భరత్…ఒక వేళ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలంటే..అధినేత చంద్రబాబుతో చర్చించి రావాలంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం భరత్ వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే…2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయాన్ని ఎదుర్కోంది. దీంతో  పార్టీని బతికించాలంటే సీనియర్ ఎన్టీఆర్ మనవడు, ఛరిష్మా కలిగిన స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీని అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌ ముందు బాబుగారి పుత్రరత్నం లోకేష్ ఏ మాత్రం సరితూగడని, పార్టీని నడిపించే శక్తి చినబాబుకు లేదని, తక్షణమే టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌కు అప్పగించాలంటూ ప్రచారం జరుగుతోంది. వివాదస్పద దర్శకుడు వర్మ లాంటి వాళ్లు కూడా టీడీపీకి మనుగడ ఉండాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీని అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా నొక్కి చెప్పాడు. దీంతో నారా, బాలయ్య మద్దతుదారులు , ఎన్టీఆర్ మద్దతుదారుల మధ్య భవిష్యత్తు టీడీపీ రథసారథి విషయంపై వాదోపవాదాలు జరుగుతున్నాయి.

అసలు ఎన్టీఆర్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్, ఛరిష్మా, నాయకత్వ లక్షణాలను 2009 ఎన్నికల ప్రచార సమయంలోనే చంద్రబాబు గమనించాడు. ఎక్కడ తన కొడుకు లోకేష్ సీఎం కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌ను క్రమంగా దూరం పెట్టారు. అటు బాలయ్య కుమార్తెను లోకేష్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. దీంతో బాలయ్య కూడా తన అల్లుడి కోసం తన అన్న కొడుకైన ఎన్టీఆర్‌తో దూరం పాటించాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బాబు, బాలయ్య ఫ్యామిలీలతో విబేధాలను పట్టించుకోకుండా సిన్మాలు చేసుకుంటూ రాజకీయాలకు దూరం పాటించాడు. ఇక నందమూరి హరికృష్ణ మరణం సమయంలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు కలిసినా ఎన్టీఆర్‌ను తమలో ఒకరిగా భావించలేదు. 2018 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊహాత్మకంగా నందమూరి హరికృష్ణ కుమార్తెను ఓడిపోతామని తెలిసికూడా కూకట్‌పల్లిలో నిలబెట్టాడు. హరికృష్ణ కుమారులు, కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ప్రచారం చేస్తారని అనుకున్నాడు..తద్వారా జూనియర్ ఎన్టీఆర్‌కు అంతగా ఛరిష్మాలేదని ప్రచారం చేయిద్దామనుకున్నాడు. అయితే చంద్రబాబు జిత్తులమారి తెలివితేటలు గ్రహించిన ఎన్టీఆర్ ప్రచారంకు దూరంగా ఉన్నాడు. దీంతో బాబు పాచిక పారలేదు.

తాజాగా పార్టీ ఘోర ఓటమి నేపథ్యంలో టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని నందమూరి ఫ్యాన్స్ నుంచి వత్తిడులు వస్తున్న నేపథ్యంలో బాలయ్య చిన్న అల్లుడు భరత్ స్పందించాడు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భరత్ మాట్లాడుతూ..జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదని చెప్పిన శ్రీ భరత్ ఒకవేళ అవసరం అనుకుంటే ..ఆయనకు పార్టీలోకి వచ్చే ఉద్దేశం ఉంటే అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తేల్చి చెప్పారు. ఇక జూనియర్ వస్తేనే పార్టీకి మంచిది అంటే తన వరకు ఒప్పుకోనని భరత్ వ్యాఖానించాడు. అసలు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పార్టీని రక్షించగలరని ఎవరైనా అంటే తాను అంగీకరించనని భరత్ అభిప్రాయపడ్డాడు . మా నమ్మకం ఏంటంటే… యువ నాయకులతో, టాలెంట్‌తో కొత్త ఆలోచనలు చేయగలిగితే పార్టీని బిల్డ్ చేసుకోవచ్చు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనతో పాటూ 294మంది.. జూనియర్ ఎన్టీఆర్‌లా తెలిసినవారు కాదు , చరిష్మా ఉన్న నాయకులు కాదు అయినా 200మంది 30 ఏళ్లలోపు ఉన్నవాళ్లు, కొత్తవాళ్లు పార్టీని నడిపించారు కదా .. పలానా వ్యక్తి వస్తేనే పార్టీకి బలం అనడం సరికాదంటూ భరత్ జూనియర్ ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితులలో చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ పార్టీ బాధ్యత చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే జూనియర్‌పై భరత్ వ్యాఖ్యలతో టీడీపీ అభిమానులు, నాయకులు షాక్‌కు గురయ్యారు. . జూనియర్ ఎన్టీఆర్ కు గట్టిగా మద్దతు ఇస్తున్న టీడీపీలోని ఒక విభాగం భరత్ వ్యాఖ్యల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇక భరత్ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టారు . జూనియర్ అభిమానులకు కామెంట్లకు నారా, బాలయ్య అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో జూనియర్, నారా, బాలయ్య వర్గాల మధ్య జరుగుతున్న ముదురుతున్న వివాదం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. మరి బాలయ్య చిన్న అల్లుడు భరత్ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat