ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణాన్ని రాజకీయం చేస్తూ చంద్రబాబు ఆయన ఆత్మకు శాంతిలేకుండా చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు తాను కొనుగోలు చేసిన 23మంది వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కోడెలను వాడుకున్న చంద్రబాబు, ఆతర్వాత ఆయనను నిర్దాక్షిణ్యంగా వదిలేశాడని విమర్శించారు.
నమ్మినవారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ టీడీపీని, చంద్రబాబును దారుణంగా విమర్శించారు.