లాస్ ఏంజిల్స్ లోని మైక్రోసాప్ట్ థియేటర్లో జరిగిన డెబ్బై ఒకటివ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో విన్నర్లకు అందజేశారు. కామెడీ షో ఫ్లీ బ్యాగ్ రచయిత ,ప్రముఖ నటి ఫోబో వాలర్ మూడు ఎమ్మీ అవార్డులను గెలుచుకున్నారు. కిల్లింగ్ ఈవ్ షో లో నటించే జోడీ కామర్ కు ఉత్తమ నటి అవార్డు దక్కింది.ఫోబో వాలర్ బ్రిడ్జ్.. బెస్ట్ లీడింగ్ కామెడీ యాక్ట్రెస్, బెస్ట్ కామెడీ సిరీస్, బెస్ట్ కామెడీ రైటింగ్ అవార్డులను గెలుచుకున్నది. అయితే అతి ప్రతిష్టాత్మకమైన బెస్ట్ డ్రామా అవార్డును మాత్రం గేమ్ ఆఫ్ థ్రోన్స్ సొంతం చేసుకున్నది.దీనికి ఎమ్మీ అవార్డుల్లో మాత్రం 8 ప్రైజ్‌లు వచ్చాయి.
