అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ,మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ఈ రోజు సోమవారం ఉదయం తీహార్ జైలుకెళ్లారు.
దేశంలోనే సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ను కలవడానికి వారు వచ్చారు. చిదంబరాన్ని పరామర్శించి .. ధైర్యం చెప్పినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ నేతల పట్ల కేసులను బనాయించి వేధిస్తున్నారు .. మేము మా పార్టీ నేతలను.. కార్యకర్తలను కాపాడుకుంటామని “ఆమె అన్నారు.