సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా లేడీ అమితాబ్ విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా చిత్ర బృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది.
గత కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన స్పందన రాగా.. తాజాగా ఇవాళ రెండో పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. తాజాగా విడుదలైన ‘సూర్యుడివో చంద్రుడివో..’ లిరికల్ వీడియో కూడా సోల్ ఫుల్ మెలోడీగా ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్ బి ప్రాక్ ఆలపించారు. కాగా దక్షిణాది సినిమాలో ఆయన పాడిన తొలిపాట ఇదే.
One of my personal favourites !! Enjoy : ) #SuryudivoChandrudivo #SarileruNeekevvaru@AnilRavipudi @ThisIsDSP @ramjowrites @vijayashanthi_m@AnilSunkara1 @BPraak @RathnaveluDop https://t.co/0r9R4p0MKJ
— Mahesh Babu (@urstrulyMahesh) December 9, 2019