వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న సీనియర్ స్టార్ నటి సమంత. అక్కినేని వారింట అడుగు పెట్టిన కానీ మునపటికి ఏ మాత్రం తగ్గకుండా అమ్మడు మంచి కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అయితే మరోవైపు 96 రీమేక్ లో కూడా తాను నటించబోతుంది.
అయితే తాజాగా ఒక ప్రముఖ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ” నాకు ఒక రియల్ హీరో బయోపిక్ లో నటించాలని ఉందని తన మనసులోని మాటను చెప్పేసింది. నేను ఇప్పటివరకు నా జీవితంలో సాధించింది చాలా తక్కువ. నన్ను మించిన వారెందరో ఉన్నారు అని అమ్మడు తెగ ఉపోద్ఘాతాలు చెప్పేసింది. అయితే ఈ అమ్మడి బయోపిక్ కోరికను ఎవరు నెరవేరుస్తారో..?