Home / ANDHRAPRADESH / చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ ఆత్మహత్య

చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ ఆత్మహత్య

ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసంలో బుధవారం రాత్రి ఉరివేసుకుని చనిపోయారు.

ఈమెకు 2016లో గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థతో పెళ్లింది. నాలుగేళ్లు అవుతున్నా సంతానం కలగకపోవడంతో శిరీష్మ డిప్రెషన్‌కు లోనయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. చలసాని శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు.