ప్రముఖ కన్నడ స్టార్ హీరో..సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల మరణించిన సంగతి విధితమే. అయితే పునీత్ రాజ్ కుమార్ మరణించాడన్న విషయం ఇప్పటికీ ఆయన మేనత్త నాగమ్మకు (90) చెప్పలేదట.
ఆమెకు అప్పు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ విషయం చెప్పకుండా దాచి పెట్టారు. పునీత్ రెండో అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్ గతంలో గుండెపోటుతో మరణించాడన్న వార్త విని ఆమె ఆసుపత్రి పాలయ్యారు. సోదరుడి పిల్లలను సొంత పిల్లల్లా చూసుకున్న నాగమ్మ.. వాళ్లకు ఏమైనా జరిగిందని తెలిస్తే తల్లడిల్లేవారట. అందుకే అప్పు గురించి చెప్పడం లేదు.