Home / MOVIES / నా అభిమాని నా సినిమాలో నటించడం గర్వంగా ఉంది: చిరంజీవి

నా అభిమాని నా సినిమాలో నటించడం గర్వంగా ఉంది: చిరంజీవి

విలక్షణ నటుడు సత్యదేవ్‌ను మెగాస్టార్‌ చిరంజీవి మెచ్చుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో సత్యదేవ్‌ గెస్ట్‌ రోల్‌ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి గొప్పతనాన్ని చెబతూ సత్యదేవ్‌ ట్వీట్‌ చేశారు.

‘‘అన్నయ్యా.. నటన, జీవితంలో మాలాంటి ఎందరికో మీరు ఆచార్య. ఒక అభిమానిగా చిరకాలం మీ పేరునే తలచుకుంటాను. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను.  మీరు నటించిన ‘ఆచార్య’లో కొద్దిసేపైనా మీతోపాటు కలిసి స్క్రీన్‌షేర్‌ చేసుకునే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గరగా నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది’’ అని సత్యదేవ్‌ పేర్కొన్నారు.

దీనిపై చిరంజీవి స్పందించారు. ‘‘సత్యదేవ్‌ థాంక్యూ.. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషంగా ఉంది. ‘ఆచార్య’లో తక్కువ సమయం ఉండే పాత్రలో అయినా నువ్వు కనిపించడం ఆనందరంగా ఉంది. ‘గాడ్‌ఫాదర్‌’లో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం గర్వకారణంగా ఉంది’’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ సినిమా ఈనెల 29న విడుదలవుతుండగా.. మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat