Breaking News
Home / MOVIES / ఈసారి నా ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్‌ చేయను: వెంకటేశ్‌

ఈసారి నా ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్‌ చేయను: వెంకటేశ్‌

తన ఫ్యాన్స్‌ని ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ డిజప్పాయింట్‌ చేయనని ప్రముఖ హీరో వెంకటేశ్‌ అన్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ‘ఎఫ్‌ 3’ మూవీ ఈనెల 27న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్‌ హైదరాబాద్‌లో ‘ఫన్‌టాస్టిక్’ పేరుతో ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ మూవీలో వెంకటేశ్‌తో పాటు వరుణ్‌తేజ్‌ కూడా నటించారు.

ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ కరోనా పరిస్థితుల ప్రభావంతో తాను నటించిన నారప్ప, దృశ్యం2 సినిమాలు ఓటీటీల్లో రిలీజ్‌ అయ్యాయని.. ఎఫ్‌3 విషయంలో అభిమానులను ఎలాంటి నిరాశకు గురిచేయకుండా థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నామని చెప్పారు. గతంలో నిరాశపడిన వారందరికీ ఈ మూవీ మంచి ట్రీట్‌ అన్నారు. తనను అభిమానించే ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ మూవీని ఎంజాయ్‌ చేస్తారని వెంకటేశ్‌ చెప్పారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum