Home / CRIME / ఘోరం.. బైక్‌పై వెళ్తూ అన్నదమ్ముల సజీవ దహనం

ఘోరం.. బైక్‌పై వెళ్తూ అన్నదమ్ముల సజీవ దహనం

ఏపీలోని జంగారెడ్డిగూడెం మండలంలో ఘోరం జరిగింది. మండలంలోని దేవులపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు సజీవ దహనమయ్యారు. శుక్రవారం ఉదయం పాలు తెచ్చేందుకు పొలం వద్దకు అన్నదమ్ములు నాగేంద్ర, ఫణీంద్ర బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్‌పై 11 కేవీ లైన్‌ కరెంట్‌తీగలు పడ్డాయి.

దీంతో మంటలు చెలరేగి అన్నదమ్ములు ఇద్దరూ సజీవ దహనమయ్యారు. వీరిలో నాగేంద్ర ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్ చదువుతుండగా.. ఫణీంద్ర ఇంటర్‌సెకెండ్‌ఇయర్‌ చదువుతున్నారు. అందివచ్చిన కొడుకులిద్దరూ ఇలా హఠాత్తుగా చనిపోవడంతో వారి తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. విద్యుత్‌శాఖ అధికారుల వైఫల్యంతోనే ఈ దారుణం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat