ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతుందన్నా మహిళలు ముందుగా బంగారం కొనేందుకే ఇష్టపడతారు. అలాంటిది ఈ సారి బంగారం కొనాలంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే పసిడిపై టాక్స్‌ను భారీగా పెంచి కేంద్రం షాక్ ఇచ్చింది.
గోల్డ్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం 15 శాతానికి పెంచింది. ఇది వరకు 10.75 శాతంగా ఉన్న ఈ టాక్స్‌ను మార్పు చేసినట్లు కేంద్రం ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది. బంగారం దిగుమతులు పెరుగుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జూన్ 30 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి.
ఇదివరకు పసిడిపై ప్రాథమిక దిగుమతి పన్ను 7.5 శాతం ఉండగా ప్రస్తుతం 12.5 శాతానికి చేరింది. దీనికి మరో 2.5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ అదనంగా జోడించారు. దీంతో గోల్డ్‌పై దిగుమతి టాక్స్ 15 శాతానికి చేరింది. దీనికి జీఎస్టీ 3 శాతం అదనం.
