Home / MOVIES / ఎన్ని ఆస్తులున్నా.. నేను సంతోషంగా లేను: రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు

ఎన్ని ఆస్తులున్నా.. నేను సంతోషంగా లేను: రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు

ఎన్ని పేరు ప్రతిష్ఠలు, ఎంత విలువైన ఆస్తులున్నా తాను సంతోషంగా లేనని ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ అన్నారు. అనారోగ్యానికి గురైతే కావాల్సిన వారు తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. చెన్నైలో ఓ సంస్థ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘బాబా’, ‘రాఘవేంద్ర’ సినిమాలు మాత్రమే తనకి ఆత్మ సంతృప్తిని అందించాయని చెప్పారు. ఆ సినిమాలు రిలీజ్‌ అయిన తర్వాతే ఆ ఇద్దరు సద్గురువుల గురించి తెలిసిందన్నారు.

హిమాలయాలంటే సాధారణమైన మంచుకొండలు మాత్రమే కాదని..అక్కడ ఎన్నో అద్భుతమైన వనమూలికలు లభిస్తాయన్నారు. వాటిని తింటే వారం రోజులకు సరిపడా శరీరానికి లభిస్తుందని చెప్పారు. మనిషికి ఆరోగ్యం ముఖ్యమని.. అనారోగ్యానికి గురైతే కుటుంబసభ్యులు తట్టుకోలేరన్నారు. తన జీవితంలో ఎన్నో విజయాలు చూశానని.. పేరు ప్రతిష్ఠలు, డబ్బు సంపాదించినా సిద్ధులకు ఉండే ప్రశాంతతలో 10 శాతం కూడా తనకు లేదని రజనీకాంత్‌ వ్యాఖ్యానించారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat