బిగ్‌బాస్ బ్యూటీ హరితేజ ప్రస్తుతం బెల్జియంలో ఎంజాయ్ చేస్తుంది. అక్కడి అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా అక్కడి వీధుల్లో షార్ట్ డ్రస్‌లో డాన్స్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీన్ని నెటిజన్లు తెగ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై తన దైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్ వేసింది హరితేజ.
హరితేజ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ ఓ షార్ట్ డ్రస్‌తో చేసిన డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. దీనికి కొందరు పాజిటివ్ కామెంట్స్ చేయగా మరికొందరు ఆ డ్రెస్ ఏంటి.. ఆ డ్యాన్స్ ఏంటి.. అంటూ నెగిటివ్‌గా కామెంట్స్‌చేశారు. దీనికి స్పందించిన బిగ్‌బాస్ బ్యూటీ “నా డ్రెస్ మీద ఫోకస్ తగ్గించి.. నా డ్యాన్స్‌ను ఎంజాయ్ చేయండి” అంటూ కౌంటర్ వేసింది.