సాయి పల్లవి ముఖ్యపాత్రలో నటించిన గార్గి థియేటర్లలో మంచి టాక్ దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక వెయిటింగ్ అవసరం లేదు గార్గి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈనెల 12 నుంచి సోనీలివ్‌లో గార్గి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చెప్తూ సోనిలివ్ సంస్థ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ మూవీలో సాయిపల్లవి టీచర్‌గా నటించింది. తన తండ్రిని ఓ మైనర్ అత్యాచారం కేసులో అరెస్టు చేయగా ఆయన్ను నిర్దోషిగా నిరూపించడానికి సాయి పల్లవి ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు, సవాళ్లు మధ్య తండ్రిని రక్షించుకుందా అనేది కథ.
Tags august12 court drama gargi ott ott movies ott telugu movies sai pallavi sonyliv Telugu Movies tollywood