నందమూరి అభిమానులకు మరికాసేపట్లో తీపికబురు తెలుపనున్నారు ఎన్బీకే 108 బృందం. బాలకృష్ణ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న ఎన్బీకే 108 సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్డేట్ ఈరోజు సాయంత్రం 4:28 చెప్పనున్నారు . ఇప్పటికే అనీల్ రావిపూడు వైజాగ్‌లోని సింహాచలం లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని పూజలు కూడా పూర్తి చేశారు. ఎన్బీకే 108 షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. థమన్ స్వరాలు అందించనున్నారు.
