రాఖీ పండుగ.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకరిమీద మరొకి ఉన్న ప్రేమను చాటుకునే పండుగ. రాఖీ అంటే రక్ష. సోదరుడు ప్రతి పనిలో విజయం సాధించాలని, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుతూ సోదరి అన్న, తమ్ముడు చేతికి రాఖీ కడుతుంది. రాఖీ కట్టించుకున్న సోదరుడు అన్నివేళలా తనకు రక్షణగా ఉంటానని ప్రామిస్ చేసినట్లు దీని అర్థం. అందుకే ఏ ఆడపిల్లా ఈ రక్షాబంధన్‌ను మిస్ అవ్వదు. అంతే కాకుండా ప్రెగ్నెంట్స్ కూడా రాఖీ కట్టొచ్చు. ప్రెగ్నెంట్స్ రాఖీ కడితే వీరు తమకే కాకుండా తమకు పుట్టబోయే బిడ్డకు అన్న, తమ్ముడు అండగా నిలవాలని కోరుతున్నట్లు అర్థమట. ఇంకెందుకు ఆలస్యం మీరు ప్రెగ్నెంట్ అయినా సరే నిర్భయంగా రాఖీ కట్టి మీ ప్రేమను చాటుకోండి..
