Home / MOVIES / నెక్ట్స్ టార్గెట్ హృతిక్ రోషన్.. నీకవసరమా అంటూ నెటిజన్స్ ఫైర్

నెక్ట్స్ టార్గెట్ హృతిక్ రోషన్.. నీకవసరమా అంటూ నెటిజన్స్ ఫైర్

ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిస్థితుల్ని చూస్తుంటే లాల్ సింగ్ చడ్డా సినిమాపై తీవ్ర వ్యతిరేకత ఇంకా కొనసాగుతూనే ఉందని అర్థమవుతోంది. కొంతమంది నెటిజన్లు బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమాను టార్గెట్‌ చేశారు. ఇటీవల ఈ మూవీ మిశ్రమ ఫలితాలను దక్కించుకోవడానికి ఈ తీవ్రత కారణమని హీరో అమీర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ సినిమా కోసం మాట్లాడగా నెటిజన్లు ఆయనకు షాకింగ్ రిప్లే ఇచ్చారు. దీంతో హృతిక్ నెక్ట్స్ సినిమా టీమ్ తలపట్టుకుంటోంది.

లాల్ సింగ్ చడ్డా సినిమాను ముంబయిలోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్‌లో చూశా అని మూవీ చాలా బాగుందని సోషల్ మీడియాలో పంచుకున్నాడు హృతిక్. ఇలాంటి మంచి సినిమాను మిస్ కావొద్దని, వెంటనే వెళ్లి చూడండని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్‌ని నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. హృతిక్‌కు రిప్లై ఇస్తూ.. ‘అవునా..అయితే ఈసారి నీ విక్రమ్‌ వేద సినిమా వంతు, హృతిక్‌ ముందు నీ సినిమా సంగతి చూసుకో, ఇప్పుడీ విషయం నీకవసరమా! ‘ఒకే! ‘బాయ్‌కాట్‌ విక్రమ్‌ వేద’ అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ వివాదంలోకి హృతిక్‌ ఎందుకు తలదూర్చాడు అంటూ ‘విక్రమ్‌ వేద’ నిర్మాతలు కూడా బాధపడుతున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat