Home / MOVIES / ఆ మూవీ కోసం హీరో మాధవన్ ఇల్లు అమ్ముకున్నాడా..?

ఆ మూవీ కోసం హీరో మాధవన్ ఇల్లు అమ్ముకున్నాడా..?

ఫేమస్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్.. గూఢచర్యం ఆరోపణల్ని ఎదుర్కొని నిరపరాధిగా బయటపడ్డారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్రీ. ఇందులో మాధవన్ నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. తాజాగా ఓ నెటిజన్ ఈ సినిమా కోసం మాధవన్ ఇంటిని అమ్ముకున్నాడని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రాకెట్రీని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చారని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన మాధవన్ ఏం చెప్పారంటే..

నెటిజన్ ట్వీట్ ఇదే..

రాకెట్రీ సినిమా కోసం హీరో మాధవన్ తన ఇంటిని అమ్ముకున్నాడు. వేరే మూవీ కమిట్‌మెంట్స ఉండడంతో ఈ సినిమా దర్శకుడు తప్పుకోగా మాధవనే డైరెక్షన్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన కొడుకు వేదాంత్ స్విమ్మింగ్‌లో దేశానికి పతకాలు సాధిస్తున్నాడు. అలాంటి గొప్ప నటుడికి అభిమానిగా ఉన్నందుకు గర్వంగా ఉంది. అని ట్వీట్ చేశాడు ఓ నెటిజన్.

మాధవన్ సమాధానం ఇలా..

దీనికి హీరో మాధవన్ రీట్వీట్ చేస్తూ.. దయచేసి నా త్యాగాన్ని అతిగా చూడకండి. ఇల్లు, ఇతర ఏ ఆస్తులు నేను అమ్ముకోలేదు. రాకెట్రీ సినిమాలో భాగమైన వారందరూ.. ఈ సంవత్సరం సగర్వంగా భారీ మొత్తంలో ఇన్‌కమ్ టాక్స్‌ కడతారు. దేవుణి దయవల్ల మా సినిమాకు మంచి లాభాలు వచ్చాయి. ప్రస్తుతం కూడా నేను నా ఇంట్లోనే ఉంటున్నా. ఈ ఇంటినే ప్రేమిస్తున్నా.. అని మాధవన్ బదులిచ్చారు.

 

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri