రౌడీ విజయ్‌దేవరకొండ, ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించిన మూవీ ‘లైగర్’. మార్షల్ ఆర్ట్స్ బ్యాగ్రౌండ్‌తో రెడీ అయిన ఈ సినిమా ఈనెల 25న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అటు బాలీవుడ్, ఇటు సౌత్‌లో ప్రచార కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూ ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మి.. సినిమా షూటింగ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.
విజయ్‌కు 2019 ఆగస్ట్‌లో ‘లైగర్’ కథ చెప్పామని.. ఆ తర్వాత కొవిడ్.. వరుస లాక్‌డౌన్‌లు వచ్చాయని ఛార్మి గుర్తు చేశారు. ఆ కష్టకాలంలో ఫైనాన్షియల్‌గా చాలా ఛాలెంజెస్ వచ్చాయన్నారు. జేబులో రూపాయి కూడా లేదని చెప్పారు. సినిమాను ఓటీటీలో అమ్మేందుకు భారీ ఆఫర్ వచ్చిందన్నారు.
అంతటి ఆఫర్‌ను కూడా రిజెక్ట్ చేశామని.. అలా చేయడానికి దమ్ము కావాలన్నారు. ఆ దమ్ము పూరీ జగన్నాథ్‌ది అని చెప్పారు. థియేటర్‌లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది అని ఆఫర్‌ను వదులుకున్నామన్నారు. అలాంటి పరిస్థితుల్లో విజయ్ అండగా నిలబడ్డాడని చెప్పుకుంటూ ఛార్మీ ఏడ్చేశారు. ఆయనే తమను ముందుండి నడిపాడని చెప్పారు.