Home / MOVIES / ‘లైగర్‌’కు బాయ్‌కాట్‌ సెగ.. విజయ్‌ కామెంట్స్‌పై నెటిజన్ల ఫైర్‌

‘లైగర్‌’కు బాయ్‌కాట్‌ సెగ.. విజయ్‌ కామెంట్స్‌పై నెటిజన్ల ఫైర్‌

రౌడీ విజయ్‌దేవరకొండ కొత్త వివాదంలో చిక్కు కున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ నటించిన లాల్‌సింగ్‌ చడ్డాపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్‌ చే సిన విషయం తెలిసిందే. బాయ్‌కాట్‌ లాల్‌సింగ్‌ చడ్డా అంటూ నెటిజన్లు అమీర్‌ఖాన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. త్వరలో విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ సినిమా రిలీజ్‌ అవుతుండటంతో విజయ్‌ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఆ ఇంటర్వ్యూలో అమీర్‌ఖాన్‌ లాల్‌సింగ్‌ చడ్డాపై స్పందించమని మీడియా ప్రతినిధులు కోరగా.. నెగిటివ్‌గా ట్రోల్‌ చేయడం వల్ల చాలా మంది సినీ కార్మికులు నష్టపోతారని.. అమీర్‌ఖాన్‌కు జరిగే నష్టం ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా టేబుల్‌పై కాలు పెట్టి మీడియాకు ఆన్సర్‌ ఇవ్వడం కూడా విజయ్‌పై నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాననే గర్వం విజయ్‌కు పెరిగిపోయిందని.. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

అదే సమయంలో లాల్‌సింగ్‌చడ్డా అంశంలో అమీర్‌ఖాన్‌కు సపోర్ట్‌ చేయడంతో విజయ్‌పైనా ట్రోలింగ్‌ స్టార్ట్‌ అయింది. లైగర్‌ సినిమాను కూడా బాయ్‌కాట్‌ చేయాలనే హ్యాష్‌టాగ్‌ ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. అమీర్‌ఖాన్‌ వివాదంలో విజయ్‌ అనవసరంగా దూరి లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్లయింది. ఇది మరింత ముదురుతుందా? వివాదం పెద్దది కాకుండా విజయ్‌ దేవరకొండ దిద్దుబాటు చర్యలేమైనా తీసుకుంటాడా? లేదా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat