ఉప్పెన సినిమాతో ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాతో బాలనటుడిగా పరిచయమైన వైష్ణవ్ తేజ్ తాజా ఆ సినిమా నాటి సంగతులను ఓ టీవీ ప్రోగ్రాంలో గుర్తు చేసుకున్నాడు. ఈ మూవీలో ఓ బాబు ఎటువంటి చలనం లేకుండా కేవలం కుర్చీలో కూర్చొని ఉంటాడు కదా తనే వైష్ణవ్ తేజ్. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో చాలా సీరియస్‌గా ఉండాల్సిన తాను ఓ సీన్‌లో నవ్వేశాడట. దీంతో చిరంజీవి తనపై కోపడినట్లు గుర్తు చేసుకున్నాడు వైష్ణవ్.
గిరీశయ్యా డైరెక్షన్‌లో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న చిత్రం రంగ రంగ వైభవంగా. కేతిక శర్మ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. వచ్చే నెల 2వ తేదీన ఈ మూవీ ప్రేక్షకులముందుకు రానుంది.