ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ హీరోగా రూపొందించిన సినిమా ‘లైగర్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో ఊహించిన దానికంటే చాలా తక్కువ మొత్తంలో కలెక్షన్లు వస్తున్నాయి. కొన్నిచోట్ల షోలు కూడా క్యాన్సిల్ చేసేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ ఐఎండీబీ ‘లైగర్’ సినిమాకు రేటింగ్ ఇచ్చింది.
ఇటీవల కాలంలో ఏ సినిమాకూ ఇవ్వనివిధంగా అత్యల్పంగా 10కి కేవలం 1.7 మాత్రమే రేటింగ్ ఇచ్చింది. కొద్దివారాల క్రితం విడుదలైన అమీర్‌ఖాన్ లాల్‌సింగ్ చడ్డాకు 5 రేటింగ్ రాగా.. అక్షయ్‌కుమార్ రక్షా బంధన్‌కు 4.6కు ఇచ్చింది. ఈ వీకెండ్‌లో అయినా కలెక్షన్లు కాస్త పెంచుకోకపోతే ‘లైగర్’ డిజాస్టర్ టాక్‌తో చెడ్డపేరు వచ్చే అవకాశముంది.