భారీ అంచనాలతో విడుదలైన లైగర్ నెగిటివ్ టాక్ దక్కించుకోవడంతో ఆ మూవీ నిర్మాత ఛార్మిని నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు గతంలో ఆమె ఓ పెద్ద స్టార్ సినిమా ఫ్లాప్ అవ్వగా సోషల్ మీడియాలో నవ్వుతూ ఉన్న కొన్ని ఎమోజీలను పెట్టిన తీరే కారణం. ఈ మూవీ ఎఫెక్ట్‌తో ఆమె సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల ట్వీట్ చేసింది. కానీ తాజాగా మళ్లీ నెట్టింట్లో ఓ పోస్ట్ చేసింది. దీంతో ఛార్మికి ఏమైంది ఎందుకు ఇలా ట్వీట్ చేసింది… దేనికోసం ఇలా చేసింది అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఛార్మి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే..
‘రూమర్స్ రూమర్స్ రూమర్స్! రిప్ రూమర్స్’ అవన్నీ ఫేక్ రూమర్స్.. వాటిలో నిజం లేదు.. అంటూ ఛార్మి ట్వీట్ చేసింది. ఏ విషయం గురించి ఆమె అలా రాసుకొచ్చిందో తెలియక ‘ఏం జరిగింది మేడమ్?’, ‘వాస్తవం ఎక్కడో ఓ చోట ఉంటుంది. అవాస్తవం అన్ని చోట్లా ఉంటుంది’, ‘జేజీఎం.. సినిమా ఏమైంది?’, ‘ఆల్ ది బెస్ట్’, ‘ఏం వదంతులు?’, సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తా అన్నారు కదా. మళ్లీ వచ్చారేంటి?’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు చమత్కారంతో కూడిన మీమ్స్ పోస్ట్ చేస్తూ రీట్వీట్ చేస్తున్నారు.