Home / MOVIES / తాను నాకెప్పుడూ సాయం అడగలేదు: అల్లుఅర్జున్

తాను నాకెప్పుడూ సాయం అడగలేదు: అల్లుఅర్జున్

హీరో శ్రీవిష్ణు అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్. ఇంతవరకు శ్రీవిష్ణు తనని ఎప్పుడూ హెల్ప్ అడగలేదని చెప్పుకొచ్చారు. తాజాగా శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా వచ్చిన బన్నీ శ్రీవిష్ణు గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో ముగ్గురు హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. ఆసినిమాలో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడని అప్పటి నుంచి తనపై ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడిందని అల్లుఅర్జున్ అన్నారు. అప్పటినుంచి తన సినిమాలు గమనిస్తూ ఉన్నానని, ఆయనకొక మంచి అభిరుచి ఉందని తెలిపారు బన్నీ. శ్రీవిష్ణు సినిమా కోసం చాలా తపన పడుతుంటాడని, ఒక నటుడు అలా పనిచేస్తే ఎవరికైనా గౌరవం పెరుగుతుందని చెప్పారు. శ్రీవిష్ణు ఇప్పటివరకు నాకు సాయం అడగలేదు. అయితే తాను సినిమాలు సరిగా ప్రచారం చేసుకోవడం లేదని అందరూ అంటున్నారని మీరు వస్తే చాలా మేలవుతుందని శ్రీవిష్ణు చెప్పాడని బన్నీ అన్నారు. అందుకే ఈ ఈవెంట్‌కు రావాలని బన్నీ డిసైడ్ అయ్యారని చెప్పుకొచ్చారు.

శ్రీవిష్ణు ముఖ్యపాత్రలో నటించిన అల్లూరి సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. కయాదు లోహార్ హీరోయిన్. ప్రదీప్‌వర్మ దర్శకత్వం. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. ఈ మూవీలో శ్రీవిష్ణు ఓ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. 

Image

Image

Image

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat