Breaking News
Home / NATIONAL / నక్కతోక తొక్కిన ఆటోడ్రైవర్.. ఒక్క రాత్రిలో కోట్లాధికారి

నక్కతోక తొక్కిన ఆటోడ్రైవర్.. ఒక్క రాత్రిలో కోట్లాధికారి

ఆటోడ్రైవర్‌కు అదృష్టం వరించింది. తాను చేసిన ఒక్క పనికి జాక్ పాట్ కొట్టి కోట్లు దక్కించుకున్నాడు. ఇంతకీ ఆటోడ్రైవర్ ఏం చేశాడో తెలుసా..

కేరళ రాజధాని తిరరువనంతపురానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్. శ్రీవరాహం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఓనం పండగ సందర్భంగా శనివారం అనూప్ ఓ లాటరీ టికెట్ కొన్నాడు. దాంతో ఆదివారం ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. టికెట్ కొనేందుకు నిర్ణయించుకున్న ఆటో డ్రైవర్ మొదట ఓ టికెట్ కొన్నాడు. తర్వాత మళ్లీ దాన్ని ఇచ్చేసి ఇంకోటి తీసుకున్నాడు. ప్రస్తుతం దానికే బంపర్ లాటరీ తగిలింది. మరోవైపు అనూప్ మలేసియాకు వెళ్లి షెఫ్‌గా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు బ్యాంక్‌లో లోనుకు ట్రై చేశాడు. లోన్ మంజూరు అయి బ్యాంకు అధికారులు తనకు ఫోన్ చేయగా ఇప్పడు ఇక వద్దని చెప్పేశాడు. విదేశీ ఆలోచన విరమించేసుకున్నాడు. లాటరీ ఎమౌంట్‌లో టాక్స్‌లు పోగా రూ.15 కోట్లును అనూప్ అందుకోనున్నాడు. ఈ డబ్బుతో అప్పులు తీర్చేసి, సొంత ఇంటి కల నెరవేర్చుకోనున్నాడు ఈ ఆటో డ్రైవర్.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino