Home / MOVIES / దుల్కర్‌ సల్మాన్ ఫస్ట్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

దుల్కర్‌ సల్మాన్ ఫస్ట్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

‘సీతారామం’ ‘మహానటి’ వంటి బ్లాక్‌ బస్టర్లతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటుడు దుల్కర్‌ సల్మాన్‌. ప్రేమ కథా చిత్రాల్లో తన నటనతో అందరి మనసులూ గెలుచుకున్న ఆయన మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు. ఇంతకీ అతడు తొలి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా? కేవలం రూ.2వేలు మాత్రమేనట.

ఓ యాడ్‌ షూట్‌లో తొలుత నటించిన దుల్కర్‌కు ఆ సంస్థ రూ.2వేలు మాత్రమే ఇచ్చింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దుల్కరే వెల్లడించాడు. అయితే అది తనకు రూ.2కోట్లతో సమానమని చెప్పుకొచ్చాడు. తనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్నట్లు వివరించాడు.

‘‘అప్పుడు నా వయసు 10 ఏళ్లు ఉండగా.. రాజీవ్‌ మేనన్‌ యాడ్‌ ఏజన్సీ వాళ్లు మా స్కూల్‌కు వచ్చారు. ఒక యాడ్‌ కోసం కొంతమందిని ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసిన వాళ్లలో నేను కూడా ఉన్నాను. వాళ్లు నాకు రూ.2వేలు ఇచ్చారు. అది నాకు రూ.2 కోట్లతో సమానం. ఆ డబ్బుల్లో నేను 500రూపాయలు మా అమ్మమ్మ, తాతయ్యలకు ఇచ్చాను.

మిగతావి మా అమ్మకు ఇచ్చాను. అప్పటి నుంచి బయటకు వెళ్లినప్పుడల్లా మా అమ్మని ఆ డబ్బులతో కొనమని చెప్పేవాడిని. మా అమ్మ మాత్రం.. నువ్వు ఆ డబ్బులు ఎప్పుడో ఖర్చుపెట్టుకున్నావని సరదాగా చెప్తూ ఉండేది. అని నాటి సంగతులను దుల్కర్‌ సల్మాన్‌ గుర్తుచేసుకున్నాడు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar