Home / MOVIES / మెగాస్టార్ అలా చేస్తారని కలలో కూడా అనుకోలేదు: సత్యదేవ్

మెగాస్టార్ అలా చేస్తారని కలలో కూడా అనుకోలేదు: సత్యదేవ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న సినిమా గాడ్‌ఫాదర్. ఇందులో సత్యదేవ్ ఓ లీడింగ్ రోల్‌లో అలరించనున్నారు. త్వరలో గాడ్‌ఫాదర్ ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో సత్యదేవ్ ఆ మూవీ, మెగాస్టార్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఓరోజు సెట్‌లో అన్నయ్య లంచ్‌కి పిలిచారని వెళ్లారట సత్యదేవ్. వెంటనే ఓ స్టోరీ చెప్పడం ప్రారంభించారట మెగాస్టార్. చిరు అలా తనకు స్టోరీ చెప్పడంతో షాక్ అయిన సత్యదేవ్ నోరెళ్లబెట్టి అలా కూర్చొండిపోయారట. ఇండస్ట్రీలో ఎంతోమంది ఆయన్ను స్ఫూర్తిలా భావిస్తారు. అలాంటి మెగాస్టార్ ఆయన్ను పిలిచి ఇలా స్టోరీ చెప్పడంతో అదో వింత కలగా భావించాడట సత్యదేవ్. అదే గాడ్‌ఫాదర్ కథ. వెంటనే సత్యదేవ్ అన్నయ్య కథ అవసరం లేదు మీరు చెప్తే నేను నటించేస్తా అని చెప్పారట. గాడ్‌ఫాదర్‌లో సత్యదేవ్ పాత్ర కీలకమని ఆయన కోసం ఓ వైపు మెగాస్టార్… మరోవైపు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్.. ఇంకోవైపు లేడీ సూపర్‌స్టార్ నయనతార అంతా తనకోసం కొట్టుకుంటారని గాడ్‌ఫాదర్ అనుభవాలను పంచుకున్నారు సత్యదేవ్.

Image

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar