మెగా అభిమానులకు గుడ్‌న్యూస్ తెలిపింది గాడ్‌ఫాదర్ టీమ్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీలోని సెకండ్ సాంగ్ ఈరోజు సాయంత్రం 5.04కు విడుదల చేయనుంది చిత్రబృందం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది యూనిట్. నజభజ పేరుతో ఉన్న ఈ పాటలో చిరు లుక్ పంచుకోగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. మెగాస్టార్ లుక్ చూస్తే ఈ పాట కూడా ఫస్ట్ సాంగ్ తార్‌మార్ తక్కర్ మార్‌లా దుమ్ములేపనుంది.
సినీప్రియుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ చేసిన మెగా మూవీ దసరా కానుకగా అక్టోబరు 5న రిలీజ్ కానుంది. మోహన్ రాజ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్, తదితరులు ముఖ్యపాత్రలో సందడి చేయనున్నారు.