ఆదిపురుష్ టీజర్ ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసింది. ఇందులో రాముడి గెటప్‌లో ప్రభాస్‌ను చూస్తే సాక్ష్యాత్తు శ్రీరాముడినే చూసినట్లు ఉంది. అయితే ఇంతలా మెప్పించిన ఈ పాత్ర చేయడానికి ప్రభాస్ ముందుగా ఒప్పుకోలేదట. దాదాపు 3 నెలలు కంటిన్యూగా నో చెప్తూనే ఉన్నాడట. ఆదివారం అయోధ్యలో జరిగిన టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఈ మూవీకి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించారు.
ప్రతి మనిషిలోనూ శ్రీరాముడు ఉంటాడని, రాముడిపై ఉన్న భయం, భక్తి తనను ఆదిపురుష్ సినిమాలో నటించేలా చేశాయని చెప్పారు హీరో ప్రభాస్. టీజర్ విడుదలకు ముందు చిత్రబృందం ఆయోధ్య రాముడిని దర్శించుకుంది.