Home / MOVIES / ప్రభాస్  సినిమా కోసం మేం పని చేయలేదు..!

ప్రభాస్  సినిమా కోసం మేం పని చేయలేదు..!

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమా ఆదిపురుష్‌. అక్టోబరు 2న ఈ మూవీ టీజర్ విడుదలైంది. అయితే ఇందులో గ్రాఫిక్స్‌ ఎక్కువగా ఉండడంతో పైగా డైరెక్టర్ టీజర్‌ను ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలాకు ట్యాగ్‌ చేశారు. దీంతో ఈ విజువల్స్ ఈ సంస్థే అందించిందని అనుకొన్న నెటిజన్లు ఆ సంస్థకు ట్యాగ్ చేస్తూ గ్రాఫిక్స్ ఇంకాస్త బాగా చేయాల్సిందని, ఏమైంది ఇలా చేశారు అని కామెంట్స్‌ చేస్తున్నారు. వీటికి సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇందుకు సంబంధించి ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.

ఆదిపురుష్ సినిమాకు ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌ వాలాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ సినిమా కోసం తాము ఎలాంటి గ్రాఫిక్ వర్క్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలా సంస్థ. ఈ సంస్థ ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌కు సంబంధించినది.

Image

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat