ప్రముఖ నిర్మాణ సంస్థల్లో అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ ఒకటి. సూపర్ డూపర్ హట్ అయినా చాలా సినిమాలు ఈ బ్యానర్ నుంచే వచ్చాయి. పిల్లా నువ్వు లేని జీవితం, బద్రీనాథ్, మగధీర, పుష్ప, జెర్సీ, అల వైకుంఠపురంలో, 100 పర్సెంట్ లవ్, జల్సా, డాడీ, అందరివాడు ఇలా చాలానే ఉన్నాయి. అయితే ఈ బ్యానర్ పేరును గీతా ఆర్ట్స్ అని ఎందుకు పెట్టారా అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇలా అందరూ మనకు తెలిసినవారే. వారి పేరు పెట్టకుండా గీత అని పెట్టారు. అల్లు వారి ఇంట్లో గీతా ఎవరా అని ఆలోచించే ఉంటారు కదా. ఇంతకీ గీత ఎవరు.. ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే..
గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థకు ఆ పేరు పెట్టింది అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య. భగవద్గీత సారాంశం నచ్చి గీత అని పేరు పెట్టారట అల్లు రామలింగయ్య. అంతే కాకుండా ఈ పేరు సినిమాలకు సరిగ్గా సరిపోతుంది అని ఆయన చెప్పారట. నిర్మాతగా నీ ప్రయత్నం మాత్రమే నువ్వు చేయు ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుందని అల్లు అరవింద్‌కు ఆ రోజుల్లో తండ్రి చెప్పారట. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పైనే ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్‌లు అవ్వడంతో ఆ పేరు మార్చాలనే ఆలోచనే అల్లు వారికి రాలేదని ఓ సందర్భంలో అల్లు అరవింద్ చెప్పారు.