హరియాణాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై ఓ హోటల్ గదిలో ఐదుగురు వ్యక్తులు సామూహికంగా అత్యాచారం చేశారు. వీరిలో ఇద్దరు ఆమె ఫ్రెండ్స్ ఉన్నారు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
శనివారం మధ్యాహ్నం పదోతరగతి చదువుతోన్న విద్యార్థిని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లి బయట వెతకగా ఎక్కడా కనిపించలేదు. ఆదివారం ఉదయం 10 గంటలకు కూతుర్ని గుర్తించిన తల్లి రాత్రంతా ఎక్కడికి వెళ్లావని అడగ్గా.. తన ఫ్రెండ్స్ ఇద్దరు బయటకు తీసుకెళ్లారని అక్కడ నుంచి మరో ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ హోటల్‌కి తీసుకెళ్లి అత్యాచారం చేశారని చెప్పింది. దీంతో షాకైన తల్లి వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అనంతరం పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అత్యాచారం జరిగిందని వైద్యులు ధ్రువీకరించారు. ఇప్పటికే ఇద్దర్ని అరెస్టు చేయగా.. మిగతావారి కోసం గాలిస్తున్నారు.