మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా జరుగుతోంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా.. అన్నట్లు సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన రౌండ్లలో ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే.
ఏఏ రౌండ్‌లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందంటే..
– మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 6418 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 5126 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 2100 ఓట్లు పోలయ్యాయి. దీంతో మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్ 1292 ఓట్లతో ఆధిక్యంలో ఉంది.
– రెండో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 7781 ఓట్లు, బీజేపీకి 8622 ఓట్లు, కాంగ్రెస్‌కు 1537 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌లో బీజేపీ 841 ఓట్లతో ఆధిక్యంలో ఉంది.
– మూడో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 7390 ఓట్లు, బీజేపీ 7426 ఓట్లు, కాంగ్రెస్ 1926 ఓట్లు దక్కించుకున్నాయి. ఈ రౌండ్‌లో బీజేపీ 36 ఓట్లుతో ఆధిక్యంలో ఉంది.
– నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్‌ఎస్ 4854, బీజేపీ 5245, కాంగ్రెస్ 2670 ఓట్లు దక్కించుకున్నాయి. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్ 299 ఓట్లతో ముందంజలో ఉంది.
– ఐదో రౌండ్‌లో టీఆర్‌ఎస్ 6162, బీజేపీ 5245, కాంగ్రెస్ 2670 ఓట్లను సొంతం చేసుకున్నాయి. 917 ఓట్లుతో ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది.
– ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్‌ఎస్ 6016 ఓట్లు దక్కించుకుగా, బీజేపీ 5378, కాంగ్రెస్ 1962 సొంతం చేసుకున్నాయి. ఈ రౌండ్‌లో 638 ఓట్లుతో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది.
– ఏడో రౌండ్‌లో టీఆర్‌ఎస్ 7189, బీజేపీ 6803, కాంగ్రెస్ 1664 దక్కించుకోగా టీఆర్‌ఎస్ 386 ఓట్లతో ముందుంది.
– 8వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ 6620, బీజేపీ 6088, కాంగ్రెస్ 907 ఓట్లు దక్కించుకోగా టీఆర్‌ఎస్ 532 ఓట్లతో ఆధిక్యంలో ఉంది.
– 9వ రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్ 7497, బీజేపీ 6665, కాంగ్రెస్ 1300 దక్కించుకుని టీఆర్‌ఎస్ 832 ఓట్లతో ముందుంది.