సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు పలు సూచనలు చేశారు.
ఇక సూపర్‌స్టార్ పార్థివదేహాన్ని నానక్ రామ్ గూడలోని ఆయన స్వగృహానికి తరలించారు. అభిమానుల సందర్శనార్ధం సాయంత్రం 5 గంటలకు భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియం వద్దకు తరలించి రేపు మధ్యాహ్నం 3 వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి. సూపర్‌స్టార్ మృతితో మహేశ్‌బాబు కన్నీరుమున్నీరు అయ్యారు. ఇక సినీ ఇండ్రస్ట్రీ మొత్తంగా కదిలి ఆయన పార్ధివదేహాన్ని కడసారి చూసేందుకు తరలి వెళ్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.