సంతోష్ శోభన్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి తను నేను చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత వినూత్న కథలతో ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా సంతోష్ శోభన్.. డెబ్యూ డైరెక్టర్ అభిషేక్ మహర్షి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “ప్రేమ్ కుమార్”. ఈ మూవీలో సంతోష్ కి జోడీగా రాశి సింగ్ నటించింది. అలానే రుచితా సాధినేని, కృష్ణ చైతన్య ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శివప్రసాద్ పన్నీరు నిర్మాతగా వ్యవహరించారు. మరి నేడు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందంటే..?
సినిమా స్టోరీ..
ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్) కు పెళ్లి సంబంధాలు వస్తాయి కానీ ఏవి సెట్ అవ్వవు. అనుకోకుండా నేత్ర (రాశి సింగ్) అనే అమ్మాయితో పెళ్లి ఒకే అవుతుంది. కానీ అదే సమయంలో రోషన్ బాబు (కృష్ణ చైతన్య) వచ్చి తను నేత్ర ప్రేమించుకున్నాము.. మా పెళ్లి చేయండి అంటూ పెళ్లి ఆపేస్తాడు. ఇక నేత్ర తండ్రి రాజ్ మాదిరాజు వెంటనే కూతురిని ఇచ్చి తనతో పంపించేస్తాడు. ఇక ప్రేమ్ కుమార్ కు మరో పెళ్లి కుదరగా అది కూడా క్యాన్సిల్ అవుతుంది. దీంతో ప్రేమ, పెళ్లి జంటలను విడగొట్టాలని తన ఫ్రెండ్ సుందర్ లింగం (కృష్ణ తేజ) తో కలిసి డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతాడు. హీరోగా ఎదిగిన రోషన్ నేత్రను కాకుండా అంగనా (రుచితా సాధినేని) ను ఎందుకు పెళ్లి చేసుకోవటానికి రెడీ అయ్యాడని తెలిసి ప్రేమ్ ఏం చేశాడు అనేది తెరపై చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్..
సినిమా స్టోరీ, నటీనటుల పర్ఫామెన్స్, సంగీతం
మైనస్ పాయింట్స్..
కొన్ని సాగదీసిన సీన్లు, రొటీన్ స్టోరీ
కంక్లూజన్..
మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్
రేటింగ్..
3/5