132- జీడిమెట్ల డివిజన్ ఎమ్ ఎన్ రెడ్డి నగర్ లో జరిగిన చేరికల కార్యక్రమంలో శ్రీనివాస్ నగర్ నివాసి వై. రాజారెడ్డి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ కాలనీలకు చెందిన సుమారు 200 మంది ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని కాలనీలలో మౌలిక వసతులైన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి సరఫరాను మెరుగుపరిచామని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సంక్షేమ పథకాలు – అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బిఆర్ఎస్ పార్టీని ముచ్చటగా మూడవసారి గెలిపించేందుకు పార్టీలో నూతనంగా చేరిన నాయకులు, కార్యకర్తలు కృషిచేసి ముచ్చటగా మూడవసారి బిఆర్ఎస్ పార్టీని భారీ విజయంతో హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : ఆర్. నాగరాజు, ప్రతాప్, సురేష్, రామ్ కోటి, సుబ్బారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సురేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సిద్ధ రాంరెడ్డి, ప్రసాద్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎల్. సత్యనారాయణ, కర్ణాకర్, గోపి, ప్రభాకర్, సత్తిరెడ్డి, బి. సత్యనారాయణ, నారాయణరెడ్డి లు…ఈ కార్యక్రమంలో డివిజన్ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.