మూవీ : గృహం
నటీనటులు: సిద్ధార్థ్,ఆండ్రియా, సురేష్,అతుల్ కుల్‌కర్ణి,అనీషా ఏంజెలీనా విక్టర్ ..
సంగీతం: గిరీష్
కూర్పు: లారెన్స్ కిషోర్
కళ: శివ శంకర్
ఛాయాగ్రహణం: శ్రేయాస్ కృష్ణ
ఫైట్స్: ఆర్.శక్తి శరవణన్
నిర్మాత: సిద్ధార్థ్
రచన: మిలింద్,సిద్ధార్థ్
దర్శకత్వం: మిలింద్ రావ్
సంస్థ: వైకామ్ 18 మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ:17-11-2017
టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమకథ చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హిట్ సినిమాలతో మార్కెట్ ను సంపాదించుకున్నాడు ..ఆ తర్వాత కథలను ఎంచుకోవడంలో విఫలమవుతూ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడుతూ వస్తున్నాడు .ఈ నేపథ్యంలో తాజాగా తన లవర్ బాయ్ ఇమేజ్ కు పూర్తి భిన్నంగా నటించిన తమిళ మూవీ ‘అవల్’. అయితే ఆసాంతం హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ తమిళంలో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో టాలీవుడ్ ‘గృహం’ పేరుతో విడుదల చేశారు. అయితే ఈ మూవీకి నిర్మాత సిద్దార్ధ కావడం గమనార్హం .ప్రస్తుత రోజుల్లో హారర్ నేపథ్యం ఉన్న మూవీలు టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోన్న తరుణంలో సిద్ధార్ధ ఏ విధంగా ఆకట్టుకున్నాడు .తనకు పూర్వ వైభవం వచ్చిందా చూద్దాం ..?
అసలు కథేంటంటే:
కృష్ణకాంత్ అలియాస్ క్రిష్(సిద్ధార్థ్) ఒక డాక్టర్. అతని భార్య లక్ష్మి(ఆండ్రియా). వారిది చాలా మంచి అన్యోన్య దాంపత్యం.వీరు హిమాలయాలకు దగ్గరగా ఉంటారు. వారి ఎదురింట్లో కొత్తగా ఒక కుటుంబం దిగుతుంది. వారిలో జెన్నీ అనే అల్లరి అమ్మాయి క్రిష్‌ని ఆటపట్టిస్తుంటుంది. ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. ఆ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత జెన్నీ ప్రవర్తనలో క్రమక్రమంగా మార్పు వస్తుంది. ఆ క్రమంలో ఆత్మహత్యాయత్నం చేస్తుంది. అప్పుడప్పుడు చైనీస్ మాట్లాడుతుంటుంది. మానసిక నిపుణుడు(సురేష్) కూడా జెన్నీ సమస్యను కనిపెట్టలేకపోతాడు. సమస్య పరిష్కారానికి పాల్(అతుల్ కుల్‌కర్ణి) అనే పాస్టర్ సాయం తీసుకుంటాడు. అప్పుడు జెన్నీలో లీజింగ్ అనే దెయ్యం ఉందన్న సంగతి తెలుస్తుంది. ఇంతకీ లీజింగ్ ఎవరు? జెన్నీని ఎందుకు ఆవహించింది? లీజింగ్‌తో పాటు ఉన్న మరో రెండు ఆత్మలు ఎవరివి అనేదే ఈ మూవీ సారాంశం ..
మరి ఎలా ఉందంటే:
ప్రస్తుతం విడుదలవుతున్న దెయ్యం నేపథ్యం ఉన్న ప్రతి సినిమా కథలన్నీ ఒక ఇంటి చుట్టూ తిరుగుతుంటాయి.ఆ ఇంట్లో భయంకర ధ్వనులు చేస్తుంటాయి. థ్రిల్ కలిగించే అంశాలు ఎక్కువ. అయితే సిద్ధూ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గృహం’ కూడా అదే పంథాలో సాగుతుంది. మరో విశేషం ఏమిటి అంటే ఈ సినిమాకు నేపథ్యంగా హిమాలయ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం .మూవీ ప్రారంభమై సన్నివేశాలు మొదట్లో కాస్త నెమ్మదిగా సాగుతుంది .కానీ ఆ తర్వాతే సినిమాలో కథలో వేగం పుంజుకుంటుంది. ఇక పతాక సన్నివేశాలకు ముందు వచ్చే ట్విస్టు, జెన్నీ పాత్ర ప్రవర్తించే తీరు ఆసక్తి రేకెత్తిస్తాయి. ఒక రొమాంటిక్ యాంగిల్‌తో కథ మొదలవుతుంది. సిద్ధార్థ్, ఆండ్రియాల మధ్య రొమాన్స్‌తో ఆయా సన్నివేశాలు సాగుతాయి. జెన్నీ పాత్ర ప్రవేశంతో కథ వేగం పుంజుకుంటుంది. ఆమెలో వచ్చే మార్పులతో కథ పతాక స్థాయికి చేరుతుంది. సౌండింగ్, విజువలైజేషన్ బాగున్నాయి. కథలో ఎవరూ వూహించని ట్విస్టు ఉంటుంది. దీంతో ఇప్పుడొస్తున్న దెయ్యాల సినిమాతో పోలిస్తే ‘గృహం’తన కంటూ ఒక ప్రత్యేకతను నిలబెట్టుకుంటుంది.నేటి హారర్ సినిమాల్లో కామెడీని జొప్పించే ప్రయత్నం చేయకుండా భయాన్ని భయంగానే చూపించడం హార్‌ర్ సినిమా ప్రేమికులకు నచ్చే విషయం. కథ ప్రారంభంలో ఇదేదో ‘చంద్రముఖి’ సినిమాలా అనిపించినా, క్రమక్రమంగా ఆ భావలన్నీ చెరిగిపోతాయి.కానీ ఈ మూవీ పతాక సన్నివేశాలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
మూవీలో ఎవరెలా చేశారంటే:
దర్శకుడు ఈ మూవీలో చాలా తక్కువ పాత్రలతో కథను నడిపించాడు . క్రిష్, జెన్నీ పాత్రలు ఈ కథకు మూలం. సిద్ధార్థ్ ఒక హారర్ సినిమా చేయటం ఇదే ప్రథమం. కానీ, ఇలాంటి జోనర్‌ను కూడా తనదైన నటనతో రక్తికట్టించగలనని నిరూపించాడు. ప్రారంభంలో సిద్ధార్థ్ అతిథి పాత్ర ఏమో అనిపించిన కానీ సెకండాఫ్ లో మాత్రం రెచ్చిపోయి నటించాడు. జెన్నీ పాత్రలో కనిపించిన అమ్మడు గ్లామర్ పరంగా సాదాసీదాగా ఉన్నా, నటన విషయంలో సిద్ధార్థ్‌కు సమాన స్థాయిలో ప్రతిభను ప్రదర్శించింది. లీజింగ్ ఆత్మ ఆవహించిన తరుణంలో ఆమె హావభావాలు భయపెట్టాయి. ఆండ్రియా లిప్‌లాక్ సన్నివేశాలు నటించడానికి మొహమాట పడలేదు. సురేష్, అతుల్ కుల్‌కర్ణి తమ పాత్రల్లో మెప్పించారు. సాంకేతికంగా చూస్తే.. దర్శకుడి స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతంలో సౌండింగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ చాలా షార్ప్‌గా సాగింది. హారర్ సినిమాల్లో కామెడీ ఎక్కువైపోయి భయం తగ్గిపోతున్న ఈ తరుణంలో ‘గృహం’ తప్పకుండా షాకిస్తుంది అని చెప్పాలి .
బలాలు
+ సిద్థార్థ్, అనీషా నటన
+ నేపథ్య సంగీతం
+ పతాక సన్నివేశాలు
బలహీనతలు
– రొమాన్స్ ఎక్కువ
– రేటింగ్ : 2.45/5
– దరువు పంచ్ లైన్ : హారర్ ప్రేమికులకు మాత్రమే నచ్చే ‘గృహం’
