గత కొన్నిరోజులుగా సినీ ఇండస్ట్రీలోని ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి సంచలనమైన లీకులు ఇస్తూ.. సోషల్ మీడియా, టీవీ డిబెట్స్‌లలో నానా హంగామా చేస్తున్న నటి శ్రీరెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట శనివారం ఉదయం అర్థ నగ్నంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అదే బాటలో మరో ట్రాన్స్ జెండర్ కూడా నేను శ్రీరెడ్డి బాటలోనే నడుస్తాను అంటూ ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేసింది. ఆ వీడియోను శ్రీరెడ్డి తన ఫేస్బుక్ పేజిలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తాను ఓ ట్రాన్స్ జెండర్ అని.. అవకాశాలు ఇవ్వకుంటే శ్రీరెడ్డిలాగే తను కూడా ఫిలిం ఛాంబర్ ఎదుట బట్టలు విప్పుకుని.. ఛాంబర్ అంతా తిరిగి.. మీడియా ఎదుట నిప్పుతో కాల్చుకుని చనిపోతానని తెలిపింది .
U dn need to die my dear..wl fight together..so what if u r a transgender .. end of the day u r a human being..u can work in the tollywood
Posted by Sri Reddy on Saturday, 7 April 2018