జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిలకడలేని వ్యక్తి అని.. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కాదని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నామన్న పవన్… ఆత్మకూరులో బీజేపీ పోటీ చేస్తుంటే ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. ఇంతకీ ఆయన …
Read More »రూ.40వేల కోట్ల భూములు.. మాకు అప్పగించేయండి: కేటీఆర్
తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ధ హామీలను అమలు చేయడం లేదని టీఆర్‌ఎస్‌వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. దేశాభివృద్ధికి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలోని సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా విక్రయిస్తోందని విమర్శించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ …
Read More »శ్రీముఖి లేటెస్ట్ ఫొటో షూట్.. పిక్స్ అదుర్స్
నటి, యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ ఫొటో షూట్‌తో అదరగొట్టింది. గోల్డ్ అండ్ మిక్స్‌డ్ సిల్వర్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫొటోలతో కుర్రకారు మతి పోగొడుతోంది. లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో శ్రీముఖి షేర్‌చేసింది.
Read More »రాకేష్ పాడె మోసిన టీఆర్‌ఎస్ మంత్రులు
సికింద్రాబాద్ అగ్నిపథ్ ఆందోళనల్లో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన ఆర్మీ ఉద్యోగార్థి దామెర రాకేష్ అంత్యక్రియలు ముగిశాయి. వరంగల్ జిల్లా దబీర్‌పేట స్మశానంలో రాకేష్ మృతదేహానికి ఆయన తండ్రి కుమారస్వామి నిప్పంటించారు. అంతకుముందు నర్సంపేట చేరుకున్న రాకేష్ మృతదేహానికి పెద్ద ఎత్తున ప్రజలు అశ్రు నివాళులర్పించారు. ఆ తర్వాత అతడి స్వస్థలానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో టీఆర్‌ఎస్ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, …
Read More »బండ్ల గణేష్‌కి ఏమైంది.. ఉన్నట్టుండి ఇలాంటి ట్వీట్ ఏంటి?
బండ్ల గణేష్ సినీ నిర్మాత, నటుడు. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వెల్లడించే ఆయన.. శనివారం చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. జీవితంలో ఎవర్నీ నమ్మొద్దంటూ బండ్ల గణేష్ విడుదల చేసిన ఆడియో క్లిప్‌పై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని మినహా జీవితంలో ఎవర్నీ నమొద్దని.. మనల్ని మనం మాత్రమే నమ్ముకుందామని పేర్కొన్నారు. మనపై కోటి ఆశలతో వాళ్లు జీవిస్తుంటారని.. వాళ్లకి మంచి భవిష్యత్తుని, అందమైన జీవితాన్ని …
Read More »బాసర ట్రిపుల్ ఐటీ ప్రతిష్ఠకు భంగం కలగొద్దు: విద్యార్థులకు మంత్రి సబిత లేఖ
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనలను చూస్తే మంత్రిగా, తల్లిగా బాధేస్తోందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాసరలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. బాసర ట్రిపుల్ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దని చెప్పారు. గత రెండేళ్లుగా కొవిడ్ పరిస్థితుల కారణంగా క్లాస్‌లు ప్రత్యక్షంగా జరగకపోవడం, ఇతర చిన్నచిన్న సమస్యలను …
Read More »కులపిచ్చోడు, మత పిచ్చోడు మనకొద్దు: కేటీఆర్
బీజేపీ నేతలు మాట్లాడితే విషం చిమ్ముతున్నారని.. హిందూ ముస్లిం మాటలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉందని, ఎవరెన్ని కూతలు కూసినా పట్టించుకోవద్దని ప్రజలకి సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అనాలోచితమైన నిర్ణయాలతో దేశాన్ని రావణకాష్టంగా మార్చేసిందని తీవ్రస్థాయిలో ఆయన …
Read More »ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు: హరీష్‌రావు
‘అగ్నిపథ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశమంతా అట్టుడికిపోతోందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా మోతెలో పీహెచ్‌సీ ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లను టీఆర్‌ఎస్ చేయించిందంటూ బండి సంజయ్‌చేసిన ఆరోపణలపై హరీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్ చేయిస్తే యూపీలో పోలీస్‌స్టేషన్‌పై దాడి ఎవరు చేశారని సూటిగా ప్రశ్నించారు. అగ్నిపథ్ విధానం యువకులకు అర్థం కాలేదంటూ …
Read More »దుర్మార్గపు ఆలోచనలతోనే ‘అగ్నిపథ్’: నారాయణ
నిరుద్యోగ యువత జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. దాని ఫలితమే దేశంలో హింసాకాండ అని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం సృష్టించినవేనని ఆయన విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో నారాయణ స్పందించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అర్ధంతరంగా ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులను మాయ చేసేందుకు దుర్మార్గపు ఆలోచనలతోనే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని నారాయణ విమర్శించారు.
Read More »బాసర ట్రిపుల్ ఐటీ వద్ద రేవంత్‌రెడ్డి అరెస్ట్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలను పరిష్కరించాలంటూ గత మూడు రోజులుగా అక్కడి విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న రేవంత్‌రెడ్డి పోలీసులను దాటుకుని క్యాంపస్‌లోనికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆ తర్వాత వారి నుంచి తప్పించుకుని గోడదూకి లోనికి ప్రవేశించారు. విద్యార్థుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడుతుండగా పోలీసులు అక్కడికి వచ్చి రేవంత్‌ను …
Read More »